వినాయక నిమజ్జనం : న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివ‌రాలివిగో..

Traffic restrictions for Ganesh immersion. వినాయక నిమజ్జనం నేఫ‌థ్యంలో సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల

By Medi Samrat  Published on  18 Sept 2021 12:35 PM IST
వినాయక నిమజ్జనం : న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివ‌రాలివిగో..

వినాయక నిమజ్జనం నేఫ‌థ్యంలో సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ట్రాఫిక్​ ఆంక్షలు అమ‌లులో ఉండ‌నున్నాయి. ఈ మేర‌కు శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిధం విధించారు. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లించ‌నున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇందుకోసం ప్రజల సౌక‌ర్యార్ధం కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 త‌దిత‌ర‌ నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటుచేశారు.

గణేష్ నిమజ్జన గూగుల్ రూట్ మ్యాప్ & ట్రాఫిక్ ఆంక్షలు

బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మమార్గ్కు వినాయక విగ్రహాల తరలింపు.

బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు.

సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లింపు.

ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు.

దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా శూబాయత్ర.

టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు మళ్లింపు

ట్రాఫిక్ ఆంక్షలు

మెహది పట్నం, తపచ్ బుత్రా అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి.

ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని పోలీసు సూచన.

ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది.

ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షణ చేయ‌నున్నారు.

విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్.. బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్దం చేసిన ట్రాఫిక్ పోలీసులు.


Next Story