ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ బాధ్యతలు.. నియామక ప్రక్రియ ప్రారంభం
గోషామహల్ పోలీసు స్టేడియంలో బుధవారం సందడి వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 4 Dec 2024 7:25 PM ISTగోషామహల్ పోలీసు స్టేడియంలో బుధవారం సందడి వాతావరణం నెలకొంది. స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అధికారులు స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్‌కు ఈవెంట్స్ నిర్వహించగా.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్‌లో మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతున్నాయి. సెలెక్ట్ అయిన వారికి అధికారులు ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్‌లో నియమించనున్నారు.
ఈరోజు ఈవెంట్స్‌లో మొత్తం 58 మంది ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు. అందులో 29 వెమెన్, 15 మెన్ ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు.. మొత్తం 44 మందిని అధికారులు ఈవెంట్స్ తర్వాత సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. సెలక్షన్స్‌కు హాజరైన అభ్యర్ధులకు 800 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. 10th సర్టిఫికెట్స్ ఆధారంగా 18 ఏళ్లు వయసు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్‌లో సెలెక్ట్ అయిన వారికి ట్రాఫిక్ నియమ నిబంధనలు చెబుతూ వారికి ట్రైనింగ్ ఇచ్చి అనంతరం డ్యూటీలో నియమించనున్నారు అధికారులు.