హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఐటీ కంపెనీలకు సిటీ పోలీసులు కీలక రిక్వెస్ట్ చేశారు. భారీవర్షాలు కురుస్తున్నందున ఐటీ ఉద్యోగులకు ఇంటి దగ్గర నుండి విధులు నిర్వహించే సౌకర్యం (వర్క్ ఫ్రమ్ హోమ్) కల్పించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందుకు తలెత్తుతున్నందున ఐటీ సంస్థలు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు కోరారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరింది. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.