సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ పోలీసు.. వీడియో

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని ఆరామ్‌ఘర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఒక్కసారిగా

By అంజి  Published on  24 Feb 2023 1:50 PM IST
Traffic Police, CPR, Hyderabad, Harishrao

సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ పోలీసు

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని ఆరామ్‌ఘర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలిన బస్సు ప్రయాణికుడిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కాపాడాడు. బస్‌స్టాప్‌ దగ్గర ఉన్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ వెంటనే పరుగెత్తుకొచ్చి సీపీఆర్‌ చేసి యువకుడి ప్రాణాలను కాపాడాడు. కానిస్టేబుల్ చర్యను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు ప్రశంసించారు. ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా రాబోయే వారంలో ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు, కార్మికులందరికీ సీపీఆర్‌ శిక్షణను నిర్వహిస్తుందని చెప్పారు.

''తక్షణమే సీపీఆర్‌ చేయడం ద్వారా విలువైన ప్రాణాన్ని కాపాడటంలో ప్రశంసనీయమైన పని చేసినందుకు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ ట్రాఫిక్ పోలీసు రాజశేఖర్‌ను చాలా అభినందిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు పెరుగుతున్న నివేదికలను దృష్టిలో ఉంచుకుని వచ్చే వారం అన్ని ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు, కార్మికులకు సీపీఆర్‌ శిక్షణను నిర్వహిస్తుంది'' అని మంత్రి చెప్పారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ వెంటనే స్పందించినందుకు సోషల్ మీడియా నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story