హనుమాన్ జయంతి విజయ యాత్ర.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic advisory for Hanuman Jayanthi procession in Hyderabad. హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి విజయయాత్ర శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు

By Medi Samrat  Published on  15 April 2022 1:52 PM IST
హనుమాన్ జయంతి విజయ యాత్ర.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి విజయయాత్ర శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ యాత్ర జరగనున్న దృష్ట్యా, ఊరేగింపు మార్గాల్లోని వివిధ పాయింట్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంచారు. ప్రధాన ఊరేగింపు ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుండి తాడ్‌బన్‌లోని హనుమాన్ మందిరం వైపు మొదలవుతుంది. ఊరేగింపు 12 కి.మీల దూరం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ముగుస్తుంది.

మరొక ఊరేగింపు కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం (రాచకొండ కమిషనరేట్ పరిధి) నుండి మొదలై చంపాపేట్ వద్ద హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించనుంది.. అక్కడి నుండి చంపాపేట్ మీదుగా DM&HS, మహిళా కళాశాల జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరనుంది. ప్రధాన ఊరేగింపులో చేరడానికి ముందు 10.8 కి.మీ ఊరేగింపు సాగనుంది. ఊరేగింపు సమయంలో, ట్రాఫిక్‌ను వివిధ ప్రదేశాలలో నిలిపివేస్తారు.. దారి మళ్లిస్తారు.

ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య రామమందిర్ గౌలిగూడ వద్ద ఊరేగింపు ప్రారంభమైనప్పుడు, అఫ్జల్‌గంజ్ నుండి శంకర్ షేర్ హోటల్ వద్ద ట్రాఫిక్ ఆపివేయబడుతుంది. SA మసీదు, బడేమియా పెట్రోల్ పంప్ MGBS వైపు మళ్లించబడుతుంది. బడేమియా పెట్రోల్ పంపు నుండి ట్రాఫిక్, SA మసీదు అఫ్జల్‌గంజ్ T జంక్షన్ వైపు మళ్లించబడుతుంది. శంకర్ షేర్ హోటల్ బైలేన్‌ల నుండి ట్రాఫిక్‌ను గౌలిగూడ చమన్ వద్ద నిలిపివేసి, BSNL లేన్ జాంబాగ్, MGBS పాత స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

ఊరేగింపు మధ్యాహ్నం 12 నుండి 12.15 గంటల మధ్య పుత్లిబౌలి ఎక్స్ రోడ్డుకు చేరుకున్నప్పుడు, రంగమహల్ నుండి ట్రాఫిక్‌ను సిబిఎస్ వైపు మళ్లిస్తారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి ట్రాఫిక్‌ను జిపిఓ అబిడ్స్ వద్ద ఎంజె మార్కెట్ వైపు మళ్లిస్తారు. యూసుఫైన్ కంపెనీ, బ్యాంక్ స్ట్రీట్, కోటి వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. అలాగే రాంకోటి నుండి ట్రాఫిక్‌ను చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు. చాదర్‌ఘాట్ నుండి వచ్చే వాహనాలను DM&HS వద్ద రామ్ కోటి వైపు మళ్లిస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 గంటల మధ్య కోటిలోని ఆంధ్రాబ్యాంకుకు చేరుకునే ఊరేగింపు దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. చాదర్‌ఘాట్‌ వైపు వచ్చే వాహనాలను చాదర్‌ఘాట్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద నిలిపివేసి.. నింబోలియడ్డ, రంగ్‌మహల్‌ వైపు మళ్లిస్తారు.

మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 గంటల మధ్య డీఎంఅండ్‌హెచ్‌ఎస్‌ వద్దకు ఊరేగింపు చేరుకున్నప్పుడు బడిచౌడి వద్ద ట్రాఫిక్‌ను కాచిగూడ క్రాస్ రోడ్డు వద్ద, హనుమాన్‌ టేకిడి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బొగ్గుల కుంట వైపు మళ్లిస్తారు. అదేవిధంగా బొగ్గులకుంట ఎక్స్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ను బొగ్గులకుంట, అబిడ్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

ఊరేగింపు రాంకోటి ఎక్స్‌రోడ్డుకు మధ్యాహ్నం 12.45 నుండి 1 గంటల మధ్య చేరుకున్నప్పుడు.. బొగ్గులకుంట ఎక్స్‌రోడ్డు వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేసి, కింగ్ కోటి వైపు- ఈడెన్ గార్డెన్ వద్ద మళ్లిస్తారు. ఊరేగింపు మధ్యాహ్నం 1.15 నుండి 1.30 గంటల మధ్య కాచిగూడ ఎక్స్‌రోడ్డుకు చేరుకునేటప్పుడు, లింగంపల్లి ఎక్స్‌రోడ్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేసి, పోస్టాఫీసు రోడ్డు, చప్పల్‌బజార్‌ వైపు మళ్లిస్తారు. YMCA నుండి ట్రాఫిక్‌ను కాచిగూడ X రోడ్‌ వైపు అనుమతించరు. YMCA వద్ద రెడ్డి కళాశాల వైపు మళ్లిస్తారు.

ఊరేగింపు మధ్యాహ్నం 1.30 నుండి 1.45 గంటల మధ్య రాజ్‌మొహల్లా చిల్లాకు చేరుకున్నప్పుడు, షాలిమార్ థియేటర్ రోడ్డు నుండి ట్రాఫిక్‌ను రాజ్‌మొహల్లా వైపు అనుమతించరు. ఈడెన్ గార్డెన్స్ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు YMCA వద్దకు మధ్యాహ్నం 1.45 నుండి 2.00 గంటలకు చేరుకున్నప్పుడు, YMCA వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. వాటర్ ట్యాంక్ వద్ద మెల్కోటే పార్క్ వైపు మళ్లిస్తారు. బర్కత్‌పురా నుండి ట్రాఫిక్‌ను రెడ్డి కళాశాల వద్ద నారాయణగూడ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు మధ్యాహ్నం 2.00 నుండి 2.15 గంటల మధ్య నారాయణగూడ ఎక్స్‌రోడ్డుకు చేరుకున్నప్పుడు, హిమాయత్ నగర్ 'వై' జంక్షన్ నుండి ట్రాఫిక్‌ను నారాయణగూడ ఎక్స్‌రోడ్డు వైపు అనుమతించరు. ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా, క్రౌన్ కేఫ్ నుండి ట్రాఫిక్ ఫ్లై ఓవర్ వైపు మళ్లించబడుతుంది.

మధ్యాహ్నం 2.30 - 3 గంటల మధ్య ఆర్టీసీ క్రాస్‌ రోడ్ల వద్ద ముషీరాబాద్‌ నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌ వైపు వాహనాలను అనుమతించరు, మెట్రో కేఫ్‌ వద్ద రాంనగర్‌ ఫిష్‌ మార్కెట్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. హిందీ విద్యాలయం నుండి ట్రాఫిక్ RTC X రోడ్స్ వైపు అనుమతించబడదు. VST వద్ద బాగ్ లింగంపల్లి వైపు మళ్లించబడుతుంది. ఇందిరా పార్క్ నుండి ట్రాఫిక్ RTC X రోడ్స్ వైపు అనుమతించబడదు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వైపు మళ్లించబడుతుంది. ఊరేగింపు అశోక్ నగర్ క్రాస్ రోడ్‌కు మధ్యాహ్నం 3.15 నుండి 3.30 గంటల మధ్య చేరుకున్నప్పుడు, గాంధీనగర్ టి జంక్షన్ నుండి ట్రాఫిక్‌ను అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్‌ల వైపు అనుమతించరు. లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా హిమాయత్ నగర్ నుంచి అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు, నారాయణగూడ ఫ్లై ఓవర్‌ వైపు మళ్లిస్తారు.

ఊరేగింపు గాంధీనగర్ టి జంక్షన్‌కు మధ్యాహ్నం 3.45 నుండి 4.00 గంటల మధ్య, కవాడిగూడ నుండి ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ వైపు మళ్లిస్తారు. డిబిఆర్ మిల్ నుండి ట్రాఫిక్‌ను గాంధీ నగర్ టి జంక్షన్ వైపు అనుమతించరు. చిల్డ్రన్స్ పార్క్ వైపు మళ్లిస్తారు. కవాడిగూడ ఎక్స్‌ రోడ్డు వద్ద సాయంత్రం 4.15 నుంచి 4.30 గంటల మధ్య ముషీరాబాద్‌ నుంచి ట్రాఫిక్‌ను అనుమతించరు, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు వైపు మళ్లించరు, జబ్బార్‌ కాంప్లెక్స్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను కవాడిగూడ వైపు అనుమతించకుండా కర్బలా మైదాన్‌ వైపు మళ్లిస్తారు. అలాగే, సెయిలింగ్ క్లబ్ నుండి ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.

ఊరేగింపు CGO టవర్స్ వద్దకు సాయంత్రం 4.30 నుండి 4.45 గంటల మధ్య చేరుకున్నప్పుడు, బన్సీలాల్‌పేట్ కమాన్ నుండి ట్రాఫిక్‌ను జబ్బర్ కాంప్లెక్స్ వద్ద కర్బలా వైపు మళ్లిస్తారు. ఊరేగింపు సాయంత్రం 5.00 నుండి 5.15 గంటల మధ్య ఆర్‌పి రోడ్డుకు చేరుకున్నప్పుడు, కర్బలా మైదాన్ నుండి బైబిల్ హౌస్ వైపు ట్రాఫిక్ రాణిగంజ్, ప్యారడైజ్ మరియు పాట్నీ వైపు మళ్లించబడుతుంది. కవాడిగూడ నుండి బైబిల్ హౌస్ వైపు ట్రాఫిక్ మళ్లించబడుతుంది. కవాడిగూడ వద్ద సెయిలింగ్ క్లబ్ వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ప్యాట్నీ నుండి ట్రాఫిక్ ప్యారడైజ్ వైపు మళ్లించబడుతుంది.

ఊరేగింపు సాయంత్రం 5.30 నుండి 5.45 గంటల మధ్య ఓల్డ్ PS రాంగోపాల్‌పేటకు చేరుకున్నప్పుడు, రాణిగంజ్ నుండి రోచా బజార్ వైపు ట్రాఫిక్ మినిస్టర్స్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది. CTO నుండి రోచా బజార్ వైపు ట్రాఫిక్ CTO వద్ద SBI వైపు మళ్లించబడుతుంది.

ఊరేగింపు సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య ప్యారడైజ్ జంక్షన్‌కు చేరుకున్నప్పుడు, బోవెన్‌పల్లి, తాడ్‌బండ్, బాలమ్‌రాయ్ నుండి CTO వైపు వచ్చే ట్రాఫిక్ బాలమ్‌రాయ్ వద్ద అన్నానగర్, క్లాసిక్ గార్డెన్స్ మరియు రాజీవ్ గాంధీ విగ్రహం వైపు మళ్లించబడుతుంది. ఊరేగింపు CTOకి సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య చేరుకున్నప్పుడు, బేగంపేట నుండి CTO వైపు వచ్చే ట్రాఫిక్‌ను రెండు వైపులా CTO ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

ఊరేగింపు సాయంత్రం 6.45 నుండి 7.00 గంటల మధ్య బ్రూక్ బాండ్‌కు చేరుకున్నప్పుడు, టివోలి థియేటర్ నుండి బ్రూక్ బాండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను త్రిముల్‌గేరీ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు సాయంత్రం 7.00 నుండి 7.30 గంటల మధ్య మస్తాన్ కేఫ్ రోడ్‌కు చేరుకున్నప్పుడు, బోవెన్‌పల్లి మార్కెట్ నుండి డైమండ్ పాయింట్ వైపు ట్రాఫిక్‌ను బోవెన్‌పల్లి మార్కెట్ వద్ద త్రిముల్‌గేరీ వైపు మళ్లిస్తారు. ఊరేగింపు చివరకు తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి రాత్రి 7.45 నుండి 8.00 గంటల మధ్య చేరుకున్నప్పుడు, బ్రూక్ బాండ్ మరియు సిఖ్ విలేజ్ నుండి ట్రాఫిక్ బాపూజీ నగర్ వైపు మళ్లించబడుతుంది.

సూచించబడిన మార్గాలు :

దిల్ సుఖ్ నగర్ నుంచి కోటి, డీఎంఅండ్ హెచ్‌ఎస్ మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులు ఎల్‌బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ మీదుగా లేదా ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట, ఆరంఘర్, అత్తాపూర్, మెహదీపట్నం మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

అదేవిధంగా, లక్డీకాపూల్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ లేదా ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు VV విగ్రహం, సోమాజిగూడ, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాష్‌నగర్ ఫ్లై ఓవర్, ప్యారడైజ్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాలని. ఇక్కడ దిగిన తర్వాత ప్రయాణికులు ఎడమవైపు JBS కు వెళ్లవచ్చు. కుడివైపు సికింద్రాబాద్ స్టేషన్‌కు లేదా నేరుగా ఉప్పల్‌కు సెయింట్ జాన్ రోటరీ వైపు వెళ్ళాలి.

ఊరేగింపు మార్గాలను నివారించాలని పౌరులను అభ్యర్థించారు. సూచించిన మార్గాల్లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా ప్రయాణ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (040 2785 2482), ట్రాఫిక్ హెల్ప్ లైన్ (9010203626) అందుబాటులో ఉంటాయి. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఉంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ హెల్ప్ లైన్ ద్వారా నివేదించవచ్చు.





















































Next Story