అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy visited Lal Darwaja Mahankali Ammavaru. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.

By Medi Samrat  Published on  16 July 2023 2:35 PM IST
అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆలయ కమిటీ రేవంత్ రెడ్డిని సత్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయటపడిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫలక్ నామా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని పొడగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుందని వెల్ల‌డించారు. మెట్రో నగరం హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు.


Next Story