హైదరాబాద్‌లో 12న టీమిండియా టీ20 మ్యాచ్.. వదంతులను నమ్మకండి.!

అక్టోబరు 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు

By Medi Samrat  Published on  5 Oct 2024 7:51 AM IST
హైదరాబాద్‌లో 12న టీమిండియా టీ20 మ్యాచ్.. వదంతులను నమ్మకండి.!

అక్టోబరు 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సెక్యూరిటీ గురించి చర్చించారు. మ్యాచ్‌ను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు.

అక్టోబర్ 12న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్‌కు ముందు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తోపాటు అగ్నిమాపక, పౌర శాఖల ఉన్నతాధికారులు, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, స్టేడియం పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నకిలీ టిక్కెట్లు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వదంతులను నమ్మవద్దని కమిషనర్ హెచ్చరించారు. ఉప్పల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సాధారణ వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story