రేపు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ర‌ద్దు

Thirty Four MMTS train services canceled. నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసినట్టు

By Medi Samrat  Published on  30 July 2022 4:30 PM GMT
రేపు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ర‌ద్దు

నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్‌ నుమా రూట్‌లో 9, హైదరాబాద్‌-లింగంపల్లి రూట్‌లో 9, ఫలక్‌నుమా- లింగంపల్లి రూట్‌లో 7, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 7 స‌ర్వీసులు, సికింద్రాబాద్‌- లింగంపల్లి రూట్‌లో ఒక్కటి, లింగంపల్లి- సికింద్రాబాద్‌ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.


Next Story