ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో నిందితులు అరెస్టు
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు.
By Medi Samrat
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను గుర్తించగా.. అందులో ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. దోపిడీ దొంగలు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించామని.. నిందితులపై బీహార్‌లో దోపిడీ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆశిష్, దీపక్ కుమార్ అనే ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 10 రోజుల క్రితమే ఖజానా జ్యూవెలర్స్‌లో దోపిడికి రెక్కీ చేసి.. ఆ తర్వాత కాల్పులు జరిపారని.. నిందితులు ఇద్దరినీ పూణేలో అరెస్ట్ చేశామని.. వారి నుంచి 900 గ్రాముల వెండీ స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ , కోల్ కత్తాలో జ్యూవెలర్స్ షాప్‌లలో కూడా దోపిడీలు జరిగాయని.. పరారీలో ఉన్న కీలక నిందితుడుపై 10 కేసులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో 10 కేజీల సిల్వర్ దోపిడీ చేయగా.. 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామని పేర్కొన్నారు.
జగద్గిరిగుట్టలో ఉంటూ ఈ దోపిడీకి ప్లాన్ చేశారు నిందితులు.. జగద్గిరి గుట్టలో అద్దెకు బైక్స్ తీసుకొని వచ్చి దోపిడీ చేశారు. అదే బైక్స్‌పై సిటీ దాటి వెళ్లిపోయినట్లు తెలిపారు. నిందితులు గోల్డ్ అనుకుని గోల్డ్ కోటెడ్ సిల్వర్‌ను ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇక్కడ ఉన్న 20 రోజుల్లో ఏ పని దొరికితే ఆ పని చేశారని.. కార్మికులను పెట్టుకున్నప్పుడు అన్ని చెక్ చేసి పెట్టుకోవాలని యజమానులకు సూచించారు.
ఖజానా లో దోపిడి చేసిన సివాని గ్యాంగ్‌గా గుర్తించారు. బీహార్‌లో శివాని గ్యాంగ్ దేశ వ్యాప్తంగా దోపిడీలు హత్యలు చేశారు. హైదరాబాద్. కలకత్తా, ఢిల్లీ, ముంబాయితో బీహార్‌లలో ఈ గ్యాంగ్ దోపిడికి పాల్పడింది. ఈ గ్యాంగ్ జ్యువెలరీ షాప్ లలో దోపిడి చేస్తుంటారు. వీరు తుపాకులు పట్టుకొని తిరుగుతారు. బీహార్ లో అక్రమంగా తుపాకులు కొనుగోలు చేసి వాడుతున్నారు.. ఒక్కసారి దోపిడీ చేసిన తరువాత మరోసారి ఆ ప్రాంతంలో శివాని గ్యాంగ్ దోపిడీ చేయదు.