స్నేహితులు క‌దా అని ఇంటికి పిలిస్తే.. మందు కొట్టి మ‌రీ రూ.75లక్ష‌లు దోచేశారు

Theft RS 75 lakhs from Real Estate Trader.ఇటీవ‌ల కాలంలో మాన‌వ సంబంధాలు మంట గ‌లిసి పోతున్నాయి. డ‌బ్బు కోసం ఎంత‌కైనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2022 10:35 AM IST
స్నేహితులు క‌దా అని ఇంటికి పిలిస్తే.. మందు కొట్టి మ‌రీ రూ.75లక్ష‌లు దోచేశారు

ఇటీవ‌ల కాలంలో మాన‌వ సంబంధాలు మంట గ‌లిసి పోతున్నాయి. డ‌బ్బు కోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు. స్నేహితులు క‌దా అని ఇంటికి తీసుకువెళితే రూ.75ల‌క్ష‌ల‌తో ప‌రారు అయ్యారు. ఈ ఘ‌ట‌న మ‌ల‌క్‌పేట‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సాయిప్రకాశ్‌రెడ్డి మూసారాంబాగ్ డివిజ‌న్ స‌లీంన‌గ‌ర్‌లోని నివ‌సిస్తున్నాడు. గోవాలో ఉండే అత‌డి ఫ్రెండ్ ఫిరోజు శుక్ర‌వారం రాత్రి న‌గ‌రానికి వ‌చ్చాడు. ఇద్ద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. ప‌బ్‌కు వెళ‌దామ‌ని ఫిరోజు కోర‌డంతో కొత్త‌పేట‌లోని ఓ ప‌బ్‌కి వెళ్లారు. అక్క‌డ పాత ఫ్రెండ్ రాజేష్ క‌లిశాడు. సాయిప్రకాశ్‌రెడ్డి, ఫిరోజ్, రాజేష్‌, రాజేష్‌ స్నేహితుడు న‌లుగురు క‌లిసి మ‌ద్యం తాగేందుకు స‌లీమ్‌న‌గ‌ర్‌లోని సాయిప్రకాష్ ఇంటికి వ‌చ్చారు.

ఫిరోజ్ ఓ గదిలో పడుకున్నాడు. మిగిలిన ముగ్గురూ కలిసి హాల్లో మద్యం తాగుతుండగా రాజేష్‌ నిద్రవస్తుందని చెబితే సాయిప్రకాశ్‌రెడ్డి అతనిని మరొగదిలోకి తీసుకెళ్లి ప‌డుకోమ‌ని చెప్పాడు. సాయిప్ర‌కాష్ రెడ్డి వాష్‌రూమ్‌కు వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి మంచంపై ఖాళీ బ్యాగు క‌నిపించింది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూస్తే రాజేష్, అత‌డి స్నేహితుడు క‌నిపించ‌లేదు. భూమి అమ్మిన రూ.75 లక్షలు ఆ బ్యాగులో ఉంద‌ని, రాజేష్‌,​ రాజేష్‌ ఫ్రెండ్‌ దొంగతనం చేశారని సాయిప్రకాశ్‌రెడ్డి మలక్‌పేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story