Hyderabad: ఐదేళ్ల క్రితం దోపిడీ... ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో తాజాగా అరెస్టు
ఎప్పటికైనా మనం చేసే పాపం మనల్ని వెంటాడుతుంది అనే మాటలు అక్షరాల నిజం... ఓ నిందితుడు గతంలో దోపిడీ చేసి పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయి తన స్వగ్రామంలో దర్జాగా జీవించసాగాడు.
By అంజి Published on 11 Feb 2025 10:52 AM IST
Hyderabad: ఐదేళ్ల క్రితం దోపిడీ... ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో తాజాగా అరెస్టు
ఎప్పటికైనా మనం చేసే పాపం మనల్ని వెంటాడుతుంది అనే మాటలు అక్షరాల నిజం... ఓ నిందితుడు గతంలో దోపిడీ చేసి పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయి తన స్వగ్రామంలో దర్జాగా జీవించసాగాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ తన చేతివాటం చూపించబోయి.. పోలీసుల చేతికి చిక్కాడు ఆ కేటుగాడు. దీంతో పూర్తిస్థాయిలో కేటుగాడి చరిత్ర బయటకు తీసిన పోలీసులు.. అది చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు... వీడు అలాంటి ఇలాంటి కేటుగాడు కాదు ఐదేళ్ల క్రితం ఓ ఇంట్లో దోపిడీ చేసి పోలీసులకే చుక్కలు చూపించి తన స్వగ్రామానికి వెళ్లి హుందాగా జీవిస్తున్నాడు. పాపం పండింది అందుకే ఈసారి పోలీసుల చేతికి చిక్కాడు...
వివరాల్లోకి వెళితే.. నేపాల్ కి చెందిన గోవింద్ బండారి అనే నిందితుడు హైదరాబాద్ నగరానికి వచ్చి సెల్ ఫోన్లు చోరీలు చేస్తున్నాడు. ఇటీవల సెల్ ఫోన్లు చోరీ చేస్తూ ఎస్ ఆర్ నగర్ పోలీసులకు చిక్కాడు. దీంతో నిందితుడు వద్ద సేకరించిన వేలి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో లో నమోదు చేశారు. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తున్న పోలీసులు ఓ విషయాన్ని గమనించి విస్తూపోయారు. నిందితుడు ఐదేళ్ల క్రితం.. 2019 డిసెంబర్ జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లోకి ప్రవేశించి... ఇంట్లో ఉన్న వారిని కత్తితో బెదిరించి నగదుతో పాటు ఆభరణాలు దోచుకున్నాడు. ఆ తర్వాత నిందితుడు గోవింద్ బండారి పోలీసుల చేతికి చిక్కకుండా నేపాల్ పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ నగరానికి వచ్చిసెల్ఫోన్ దొంగతనాలు చేస్తూ ఎస్సార్ నగర్ పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో పోలీసులు అతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అయితే పాత కేసుల విచారణలో భాగంగా 2019 దోపిడీ కేసులో ఫింగర్ ప్రింట్స్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు పరిశీలిస్తున్న సమయంలో ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో నిందితుడు వేలి ముద్రలు సరిపోవడంతో వెంటనే అలెర్ట్ అయ్యి నిందితుడిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు ఇదిలా ఉండగా సెల్ ఫోన్ దొంగ తనం కేసులో రిమాండ్ లో ఉన్న నిందితుడు గోవింద్ బండారి అప్పడికే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరోసారి నేపాల్ కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన జూబ్లీహిల్స్ పోలీసులు టెక్నాలజీ వినియోగంతో పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి మీద మొత్తం 14 కేసులు ఉన్నట్లు గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.