హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు ఓ గుడ్ న్యూస్. తమ పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం కొత్త ఆసుపత్రి వచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2024 1:22 PM GMT
largest veterinary hospital, South India, Shamshabad, Hyderabad

హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్ 

హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు ఓ గుడ్ న్యూస్. తమ పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం కొత్త ఆసుపత్రి వచ్చింది. 'మా సరస్వతి' పశు వైద్యశాల హైదరాబాద్ కు వచ్చింది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పశువైద్యశాలలలో ఒకటైన ఈ ఆసుపత్రిని శంషాబాద్‌లో ప్రారంభించారు.

శంషాబాద్ సమీపంలోని పెద్దషాపూర్ తండాలోని బురుజ్‌గడ్డలోని సత్య శివం సుందరం గౌ సేవా కేంద్రంలో దాతలు, జంతు ప్రేమికులు ఇచ్చిన విరాళాలతో రూ.3 కోట్లతో దీనిని నిర్మించారు. మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్ లో ఆధునిక డయాగ్నోస్టిక్స్, ఎక్స్-రే యంత్రం, ఎండోస్కోప్, బ్లడ్-ఇన్సులిన్ ఎనలైజర్ మాత్రమే కాకుండా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేక వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. అంబులెన్స్, ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అనేక రోగనిర్ధారణ సౌకర్యాలు, మెడికల్ డిస్పెన్సరీ, ఐదుగురు వెటర్నరీ వైద్యులు, ఐదుగురు సహాయకులు, ఐదుగురు పారా మెడికల్ సిబ్బంది ఈ ఆసుపత్రిలో భాగమే. ఈ ఆసుపత్రి నిర్మాణం వెనుక ఉన్న 85 ఏళ్ల ధరమ్‌రాజ్ రంకా కుటుంబ సభ్యులు రూహి, మెహర్ ఆదివారం నాడు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.

రోజుకు 10 శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు రోజుకు 100 జంతువులకు చికిత్స అందించేందుకు వీలుగా ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ధరమ్‌రాజ్ రంకా మనవరాలు, చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ నిషితా రంకా తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఆసుపత్రిలో సంవత్సరానికి 3,000 కు పైగా శస్త్రచికిత్సలు చేయడమే కాకుండా.. OPDలో సంవత్సరానికి 36,000 జంతువులకు చికిత్స చేయాలని భావిస్తున్నారు.

అత్యాధునిక పశువైద్యశాల గగన్‌పహాడ్‌లోని సత్య శివం సుందరం గౌ శాల వద్ద ఆశ్రయం పొందుతున్న 6,000 ఆవులను మాత్రమే కాకుండా, బురుజుగడ్డలోని సత్య శివం సుందరం గౌ సేవా కేంద్రంలో 2,800 ఆవులు, చుట్టుపక్కల ప్రాంతాలలోని గొర్రెలు, మేకలు, కుక్కలకు కూడా సేవ చేస్తాయి. గత 30 సంవత్సరాలుగా గోవులను రక్షించే లక్ష్యంతో పనిచేస్తున్న 85 ఏళ్ల ధరమ్ రాజ్ రంకా చిరకాల స్వప్నం మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్. ధరమ్ రాజ్ రంకా 1991 నుండి గోవుల హక్కుల కోసం పోరాడుతున్నారు. జంతువుల కోసం అత్యాధునిక పశువైద్యశాల నిర్మించాలన్న ధరమ్ రాజ్ రంకా జీవితకాల కల ఇప్పుడు నెరవేరింది.

Next Story