హైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలు.. ఏటీఎస్ అదుపులో తండ్రి, కూతురు
హైదరాబాద్ నగరంలోనిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కి సంబంధించి ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి.
By అంజి Published on 28 Jun 2023 8:47 AM GMTహైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలు.. ఏటీఎస్ అదుపులో తండ్రి, కూతురు
హైదరాబాద్ నగరంలోనిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కి సంబంధించి ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. సూరత్‌కు చెందిన సుబేరా బానుతో పాతబస్తీకి చెందిన ఫసీని లింకులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. శ్రీనగర్‌కు చెందిన నాజీర్ హయత్, హజీంలతో కలిసి ముఠాను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాలని సుబేరా బాను టీం నిర్ణయించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫసీని అదుపులోకి తీసుకుని విచారించిన గుజరాత్ ఏటీఎస్ బృందం.. తండ్రి, కుమార్తెలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఐఎస్‌కేపీ కార్యకలాపాల్లో వీరిద్దరూ చురుగ్గు పాల్గొన్నట్లు గుర్తించారు.
ఐఎస్‌కేపీకి సంబంధించిన ఉగ్రవాద కేసు దర్యాప్తులో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బుధవారం నగరంలోని అమీర్‌పేటలోని కోచింగ్ సెంటర్లలో సోదాలు నిర్వహించింది. మంగళవారం అదుపులోకి తీసుకున్న 18 ఏళ్ల యువకుడితో సహా నలుగురిని ప్రశ్నించిన తర్వాత సోదాలు జరిగాయి. మంగళవారం సాయంత్రం ఎన్టీపీసీలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. మహ్మద్ జావేద్ (46), అతని కుమార్తె ఖదీజా (20)లను ఏటీఎస్ అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.
తండ్రీకూతుళ్లు హైదరాబాద్‌లోని టోలీచౌకి నివాసులు, బక్రీద్ వేడుకల కోసం కొద్దిరోజుల క్రితం పెద్దపల్లి జిల్లాలోని ఎన్‌టీపీసీలోని బంధువుల ఇంటికి వచ్చారు. అయితే ఏటీఎస్ సోదాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.