రాహుల్‌ గాంధీ పర్యటన.. ఓయూలో ఉద్రిక్తత

Tension erupts in Osmania University over clashes between students ahead of Rahul's tour. ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ

By Medi Samrat  Published on  3 May 2022 9:22 AM GMT
రాహుల్‌ గాంధీ పర్యటన.. ఓయూలో ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌వీ నేతలు ఆందోళనకు దిగడంతో మంగళవారం వర్సిటీలో ఉద్రిక్తత నెల‌కొంది. కొందరు ఎన్‌ఎస్‌యూఐ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయగా, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌వీ నాయ‌కులు దహనం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఈ నెల 7న హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో చర్చించనున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి నిరాకరించింది.

మరోవైపు విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉస్మానియా యూనివర్శిటీలోకి రాహుల్ గాంధీ రాకుండా అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌వీ నేతలు సన్నద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ కూడా ఆందోళనకు దిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన నిర్ణయాన్ని కూడా హైకోర్టు దాదాపు యూనివర్సిటీకే వదిలేసింది.














Next Story