ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత
Tension at MJ Market. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on
9 Sep 2022 12:43 PM GMT

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ హైద్రాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైన విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనంతరం వ్యాఖ్యలను నిరసిస్తూ గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ కార్యక్రమం జరుగుతుండగా మైక్ ను లాక్కున్నాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అప్రమతమైన పోలీసులు నందు బిలాల్ ను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేయగా.. నందు బిలాల్ అనుచరులు, టీఆర్ఎస్ మహిళా నేతలు బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. దీంతో మహిళ పోలీసులు ఆందోళన కు దిగిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
Next Story