అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ సేవ‌లు అభినంద‌నీయం

Telangana Vigilance Chief KR Nandan praised for services of Amrita Cultural Trust. ఉతృష్ట‌మైన‌ భార‌తీయ నృత్య‌ క‌ళారూపాల‌కు పున‌ర్‌వైభ‌వంతో పాటుగా అంత‌రించిపోతున్న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2022 12:07 PM GMT
అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ సేవ‌లు అభినంద‌నీయం

ఉతృష్ట‌మైన‌ భార‌తీయ నృత్య‌ క‌ళారూపాల‌కు పున‌ర్‌వైభ‌వంతో పాటుగా అంత‌రించిపోతున్న నృత్యరూపాల పున‌రుజ్జీవ‌నం కోసం రాజేష్ ప‌గ‌డాల నేతృత్వంలోని అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ సేవ‌లు అభినంద‌నీయమ‌ని తెలంగాణ విజిలెన్స్ ఛీప్ కేఆర్ నంద‌న్ ప్ర‌శంసించారు. భార‌త‌దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ నృత్య రూపాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో తార‌మ‌తి-భార‌ద‌రి వేదిక‌గా నిర్వ‌హించిన నాట్య తోర‌ణం-2022 నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిర్వ‌హ‌కుల‌కు, పాల్గొన్న క‌ళాకారుల‌కు శుభ‌కాంక్ష‌లు తెలుపుతూ ఈ రంగంలో వారు మరింత ముందుకు సాగాల‌ని తెలంగాణ విజిలెన్స్ ఛీప్ కేఆర్ నంద‌న్ ఆకాంక్షించారు.


అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నాట్య తోర‌ణం-2022 పేరుతో నేడు తార‌మ‌తి-బార‌ద‌రిలో నిర్వ‌హించిన కార్య‌క్రమానికి తెలంగాణ విజిలెన్స్ ఛీప్ కేఆర్ నంద‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. కేంద్ర సంగీత నాట‌క‌ అకాడ‌మీ గ్ర‌హీత ఆచార్య క‌ళాకృష్ణ‌, రిటైర్డ్ ఐఏఎస్, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త తోట చంద్ర‌శేఖ‌ర్, భ‌ర‌త‌నాట్యంలో విశిష్ట‌త సాధించిన క‌ళైమ‌మ‌ణి డాక్ట‌ర్ రాజేశ్వ‌రి సాయినాథ్, కూచిపూడి నాట్య‌రంగ నిపుణురాలు, న‌టి సంధ్య రాజు, యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యాన్స్ హెడ్ డాక్ట‌ర్ అనురాధ బిక్షు, ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌డ్డేప‌ల్లి కృష్ణ ప్ర‌త్యేక‌ అతిథులుగా పాల్గొన్నారు.

సురేంద్ర‌నాథ్ గ్రూప్ (హైద‌రాబాద్‌) ఆధ్వ‌ర్యంలో గ‌ణేష్ ప్రార్థ‌న‌, పుదుచ్చేరికి చెందిన అభ‌య‌క‌రం కృష్ణ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో భ‌ర‌త‌నాట్యం, బెంగ‌ళూరుకు చెందిన మ‌ధులిత మొహ‌పాత్ర గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ఒడిస్సి, హైద‌రాబాద్‌కు చెందిన కళాకృష్ణ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర నాట్యం ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. 6 డ్యాన్స్ ఫామ్స్‌ల‌కు 300 ఎంట్రీలు రాగా 7 బృందాలకు నేడు తారామ‌తి బారాధ‌రి వేదిక‌పై ప్ర‌ద‌ర్శ‌న అవ‌కాశం ద‌క్కింది.


భార‌తీయ సంప్ర‌దాయ క‌ళ‌లైన భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, క‌థ‌క్‌, ఆంధ్ర‌నాట్యం, నృత్య‌రూప‌కాలు పున‌రుద్ధ‌ర‌ణ చేయ‌డానికి హైద‌రాబాద్ కేంద్రంగా అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ ఏర్పాటైంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్య‌త‌తో నృత్య క‌ళాకారుల‌కు ప్రోత్సాహం అందించ‌డం మ‌రియు ఎంట్ర‌ప్రెన్యూర‌ల్ అవ‌కాశాల‌ను క‌ల్పించేందుకు అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, భార‌త‌దేశానికి చెందిన పురాత‌న‌మైన, అంత‌రించి పోతున్న నాట్య రూప‌కాల‌కు పున‌ర్‌వైభ‌వం క‌లిగించేందుకు కృషి చేస్తోంది. టెక్నాల‌జీ, సోష‌ల్ మీడియా ఆధారంగా కళాకారిణుల‌ను, డ్యాన్స్ అకాడ‌మీల‌ను ప్రోత్స‌హిస్తోంది. నృత్యాన్ని ఒక వృత్తిగా తీసుకొని ముందుకు సాగే వారికి స్కాల‌ర్‌షిప్‌ల‌ను అంద‌జేస్తోంది. సంప్ర‌దాయ నృత్య‌రూప‌కాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం, ప్రోత్స‌హించ‌డం కోసం కృషి చేస్తోంది. స్పెషాలిటీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌ల‌లో భాగంగా ఉత్సాహ‌వంతులైన యువ‌త‌ను గుర్తించి వారిని ఇన్ స్పైర్ చేస్తోంది. దీంతోపాటుగా హైద‌రాబాద్ క్లాసిక‌ల్‌ డ్యాన్స్ ఫెస్టివ‌ల్ పేరుతో 2-3 రోజుల పాటు నిర్వ‌హించే కార్య‌క్ర‌మం ద్వారా సంప్ర‌దాయ నాట్య రూపాల విశిష్ట‌త‌ను చాటిచెప్పే అవ‌కాశం క‌లిగింది. అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ యొక్క రెండో వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మ‌మైన నాట్య తోర‌ణం- 2022 ద్వారా భార‌త‌దేశ‌వ్యాప్తంగా ఉన్న నిపుణులైన డ్యాన్స‌ర్ల క‌ళాప్ర‌ద‌ర్శ‌న వీక్షించే అవ‌కాశం ద‌క్కింది. ప్ర‌ముఖ న‌టి, యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి సైతం ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు.


సీరియ‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్, సివిల్ ఇంజ‌నీర్ అయిన రాజేష్ ప‌గ‌డాల స‌మాజానికి త‌న వంతుగా స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న‌లో భాగంగా ఏర్పాటైన ఒక వేదిక‌. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీల ఆవిర్భావానికి కార‌ణం అయిన రాజేష్ ప‌గ‌డాల అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ ద్వారా ఉత్సాహ‌వంతులైన నాట్య ప్ర‌తిభావంతుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. మేనేజింగ్ క‌మిటీలో మ‌రో కీల‌క వ్య‌క్తి భార్గ‌వి ప‌గ‌డాల టెక్నాల‌జీ సర్వీసెస్ లో 25 సంవ‌త్స‌రాల‌కు పైగా అనుభ‌వం క‌లిగి ఉన్న భార్గ‌వి సామాజిక బాధ్య‌త‌తో కూడిన ప‌నులు చేసేందుకు త‌న వంతు క్రియాశీల బాధ్య‌త‌ను ఎంతో ఉత్సాహంగా నెర‌వేరుస్తుంటారు. మేనేజింగ్ క‌మిటీలోని ఇత‌ర స‌భ్యులైన సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల‌, సురేంద్ర‌నాథ్ యొక్క క్రియాశీల కృషి వ‌ల్ల అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ యొక్క కార్య‌క‌లాపాలు విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్నాయి.


Next Story