Hyderabad: మహంకాళి బోనాల జాతర.. స్పెషల్ బస్సులు నడపనున్న ఆర్టీసీ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్‌టీసీ నడుపుతోంది.
By అంజి Published on 20 July 2024 12:45 PM ISTHyderabad: మహంకాళి బోనాల జాతర.. స్పెషల్ బస్సులు నడపనున్న ఆర్టీసీ
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్‌టీసీ నడుపుతోంది. నగరంలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పనుంది. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్‌పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను #TGSRTC నడుపుతోంది. #Hyderabad లోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పనుంది. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్… pic.twitter.com/70x6ueJohm
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 19, 2024
కాగా ఆషాడమాసంలో ప్రతి సంవత్సరం జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈ నెల 21, 22 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నారు. ఈజాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలీసు యంత్రాంగం సైతం శాంతిభద్రతల పరిరక్షణకై భారీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రభుత్వం బోనాల జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే జోగినీలతో సమావేశం నిర్వహించింది.