ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 4:30 PM IST

ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు

హైదరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐబొమ్మ వెబ్‌సైట్ అధిపతిగా భావిస్తున్న ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ నెట్‌వర్క్‌లను ప్రోత్సహించడానికి, నిర్వహించడానికి ఈ ముఠా OTT ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించిందని పోలీసులు వెల్లడించారు. అధికారులు ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఐబొమ్మ ముఠా నాయకుడిని గుర్తించడానికి ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నారు.

"త్వరలో ఐబొమ్మ హెడ్ ను పట్టుకుంటాం. భారతదేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాకు చెక్ పెట్టబోతున్నాం, దీనికి హైదరాబాద్ పోలీసులే కారణం" అని ఒక సీనియర్ అధికారి అన్నారు.

Next Story