Hyderabad: నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత

నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ముట్టడించింది

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 2:47 PM IST

Telangana, Hyderabad, Nampally, Inter Board office, Telangana Jagruti Student, Protest

Hyderabad: నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్: నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ముట్టడించింది. ఒక్కసారిగా విద్యార్థులందరూ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులకు హల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిప డ్డారు.తక్షణమే 300 మంది విద్యార్థులకు హల్ టికెట్లు ఇచ్చి , ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అది గమనించిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య గొడవ జరగడంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story