మెట్రోలో మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాలకు తెగ తిరిగేస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 24 Nov 2023 4:17 PM ISTతెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా తెగ తిరిగేస్తూ ఉన్నారు. ఇక కొత్త తరహా ఇంటర్వ్యూలను కూడా ఇస్తున్నారు. కేటీఆర్ ప్రజలకు మరింత దగ్గరవ్వడానికి హైదరాబాద్ మెట్రోలో పర్యటించారు. తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఐరన్ రాడ్డును పట్టుకొని నిలుచుని.. ఎన్ని రోజులు అయింది హైదరాబాద్‌కి వచ్చి అని పక్కనే ఉన్న సామాన్యుడిని అడిగారు. కేటీఆర్ తో ఫోటోలు తీసుకోడానికి చాలా మంది ఎగబడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగైదు రోజుల్లో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్ లు చాలా రావొచ్చని హెచ్చరించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తంగా ఉండి ఓటర్లను చైతన్య పరచాలని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.