ఆ రూల్‌ జూబ్లీహిల్స్ పరిధిలో మాత్రమేనట ..!

Telangana High Court On Jubilee Hills Pubs. హైదరాబాద్ లోని పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను బంద్ చేయాలంటూ గతంలో

By Medi Samrat  Published on  31 Oct 2022 7:30 PM IST
ఆ రూల్‌ జూబ్లీహిల్స్ పరిధిలో మాత్రమేనట ..!

హైదరాబాద్ లోని పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను బంద్ చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సవరించింది. ఈ నిబంధన జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్ లకు మాత్రమే పరిమితమని హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు చెప్పింది. జూబ్లీహిల్స్ పరిధిలోని 10 పబ్ లు మాత్రమే రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను నిలిపివేయాలని.. జూబ్లీహిల్స్ మినహా నగర పరిధిలోని ఇతర పబ్ లకు ఈ నిబంధన వర్తించదని హైకోర్టు తెలిపింది.

హైదరాబాద్ పరిధిలోని పబ్ లలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ ను నిలిపివేయాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంజ్ అసోసియేషన్ లు హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంబ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ తీర్పు చెప్పింది. మ్యూజిక్ బంద్ చేస్తే ఇక పబ్ లకు ఎవరు వెళ్తారంటూ విమర్శలు కూడా వచ్చాయి. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే..!


Next Story