'హైడ్రా' కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు చురకలు

హైదరాబాద్‌: హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పని తీరే అభ్యంతరకరంగా ఉందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

By అంజి  Published on  30 Sep 2024 7:23 AM GMT
Telangana High Court, Hydraa, AV Ranganath, Hyderabad

'హైడ్రా' కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు చురకలు

హైదరాబాద్‌: హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పని తీరే అభ్యంతరకరంగా ఉందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. అమీన్‌పూర్‌ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌.. హైకోర్టుకు వర్చువల్‌గా హాజరయ్యారు.

''నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి.. మీరు చట్టాన్ని ఉల్లగించి కూల్చివేతలు చేస్తున్నారు. ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా?'' అని హైకోర్టు హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది.

తాము అడిగిన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలని, దాట వేయొద్దని కమిషనర్‌ రంగనాథ్‌కు కోర్టు చురకలు అంటించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా? అని హైకోర్టుపై హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్‌ తహశీల్దార్‌ కోరడంతో యంత్రాలు, సిబ్బందిని సమకూర్చామని రంగనాథ్‌ కోర్టుకు తెలిపారు. చార్మినార్‌ కూల్చివేతకు తహశీల్దార్‌ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

Next Story