డిసెంబర్ నాటికి.. హైదరాబాద్‌లో మరో 41 బస్తీ దవాఖానాలు

Telangana health dept to launch 41 more Basthi Dawakhanas in Hyderabad by December. హైదరాబాద్: పట్టణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ తన ప్రయత్నాలను

By అంజి  Published on  10 Nov 2022 7:18 AM IST
డిసెంబర్ నాటికి.. హైదరాబాద్‌లో మరో 41 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్: పట్టణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో మరో 41 బస్తీ దవాఖానలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 41 అదనపు బస్తీ దవాఖానాలు, హైదరాబాద్‌లో ఇటువంటి సౌకర్యాల మొత్తం సంఖ్యను దాదాపు 300కి తీసుకువెళతాయి,. రాబోయే కొన్నేళ్లలో తెలంగాణ అంతటా 141 మునిసిపాలిటీలలో కనీసం 288 బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

బస్తీ దవాఖానాస్ కాన్సెప్ట్ తక్కువ ఖర్చుతో కూడిన అర్బన్ హెల్త్ క్లినిక్‌ల తరహాలో అభివృద్ధి చేయబడింది. ఇవి పట్టణ పేదలకు, ముఖ్యంగా రోజువారీ కూలీలకు, వలస కార్మికులు, వారి కుటుంబాలకు ఉచిత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, రోగనిర్ధారణ సేవలను అందించడంపై దృష్టి సారించాయి. 2018-19లో ఇటువంటి సదుపాయాన్ని ప్రారంభించినప్పటి నుండి, హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాలకు ప్రతిస్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య శాఖ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

డిసెంబరు 31 నాటికి జిహెచ్‌ఎంసి పరిధిలో మరో 41 బస్తీ దవాఖానలను వైద్య ఆరోగ్య శాఖ చేర్చగలదని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలోని బస్తీ, పల్లె దవాఖానలకు సపోర్ట్‌గా మరో 13 టి-డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్‌లు కూడా రానున్న కొద్ది నెలల్లో సిద్ధం కానున్నాయని మంత్రి తెలిపారు.

సాధారణంగా.. బస్తీ దవాఖానా మురికివాడల స్థావరానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఇవి స్థానిక జనాభాకు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఇవి హైదరాబాద్‌లో బాగా ప్రాచుర్యం పొందటానికి ప్రధాన కారణం. సగటున ఒక్కో దవాఖానా కనీసం 5,000 నుండి 10,000 మంది వ్యక్తులకు సేవలు అందిస్తుంది. ఉచిత డాక్టర్ సంప్రదింపులు, ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు, మందులను అందిస్తుంది. తెలంగాణలోని దాదాపు అన్ని బస్తీ దవాఖానాలు, హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో టీ-డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ లాబొరేటరీ హబ్‌లకు అనుసంధానించబడి ఉన్నాయి.

ఇవి రోగి రక్త నమూనాలను పరీక్ష కోసం స్వీకరిస్తాయి. హైదరాబాద్‌లో, సెంట్రల్ టి-డయాగ్నోస్టిక్ హబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM), నారాయణగూడలో ఉంది. ఇది ఇటీవల NABL గుర్తింపు పొందింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు, తెలంగాణాలో మరో 13 టి-డయాగ్నస్టిక్ సెంట్రల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఇలాంటి 20 టి-డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్‌లు ఉన్నాయి. ఇవి 36 లక్షల మంది రోగులకు తమ సేవలను అందించాయి. 2017 నుంచి అక్టోబర్, 2022 మధ్య 6.5 కోట్ల పరీక్షలను నిర్వహించాయి.

Next Story