హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పోలీసులను నివేదిక కోరారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేందర్‌రెడ్డిలను గవర్నర్ ఆదేశించారు.
మే 28న జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు కారులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా కథనాలు చూసిన గవర్నర్ సౌందరరాజన్ నివేదిక కోరారు. ఈ క్రూరమైన నేరం పట్ల తాను తీవ్ర వేదనకు గురయ్యానని.. ఈ ఘటనపై సమగ్ర నివేదికను పోలీసుల నుంచి కోరినట్లు ఆమె తెలిపారు.
కాగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వీడియోలను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "మైనర్‌పై అత్యాచారం కేసులో చట్టం నుండి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను శిక్షించే స్థాయిలోనే.. ఘటనకు సంబంధించిన వీడియోలను పబ్లిక్ డొమైన్‌లోకి లీక్ చేసిన మృగాలను శిక్షించాలని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.