మూసీ పునరుజ్జీవనంపై సలహాలివ్వండి..ప్రజలకు కేబినెట్ సబ్ కమిటీ పిలుపు

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 31 March 2026 10:00 PM IST

Telangana, Hyderabad, MusiRiver, Musi Rejuvenation, Telangana Government, Public Participation

మూసీ పునరుజ్జీవనంపై సలహాలివ్వండి..ప్రజలకు కేబినెట్ సబ్ కమిటీ పిలుపు

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ, ఈ ప్రాజెక్టుపై పౌరుల నుండి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంది.

ఆసక్తి గల వారు ఈ రోజు నుండి ఏప్రిల్ 15 వరకు తమ అభిప్రాయాలను నేరుగా musirrdc@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్‌కు పంపవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. నది అభివృద్ధికి ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకునే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని కల్పించినట్లు కమిటీ వెల్లడించింది.

Next Story