హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ టీజీఐఐసీ విడుదల చేసంది. ఒక్క గజానికి రూ.3,10,000 రిజర్వ్ ధర నిర్ధారిస్తూ టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ-వేలం జరగనుంది.