హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) దుర్మరణం చెందాడు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కమాన్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ముందు వెళ్తున్న లారీని ఆయన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ తీవ్రంగా గాయపడగా.. మలక్‌పేట్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనిష్క్ మరణించాడు. కనిష్క్ తల్లి తీగల సునరిత హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌గా పని చేశారు.
ఇదిలా ఉంటే.. సనత్ నగర్‌లో మరో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు యువకులు కలిసి ఒకే బైక్ పై ట్రిబుల్ రైడింగ్ చేస్తూ అతి వేగంతో ప్రయాణించారు. దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి మెట్రో పిల్లర్ ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అధిక వేగంతో పాటు రాష్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.