టాటా బోయింగ్ విజన్​.. హైదరాబాద్ లో ఇక అదుర్స్

Tata Boeing to make components for 737 planes in Hyderabad. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ఇక్కడ ఎన్నో కొత్త

By Medi Samrat
Published on : 6 Feb 2021 3:50 PM IST

టాటా బోయింగ్ విజన్​.. హైదరాబాద్ లో ఇక అదుర్స్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ఇక్కడ ఎన్నో కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ సారథ్యంలో పలు దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా చేస్తున్న విషయం తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే పనిలో భాగంగా పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. దీనితోఎంతో మంది యువతకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో టాటా బోయింగ్ విజన్ విస్తరణపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బోయింగ్ -737 కీలక విడిభాగాల తయారీకి హైదరాబాద్ కేంద్రం అవడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు.

విమానతయారీ, రక్షణ ఉత్పత్తి రంగాల్లో ఇదోక కీలకమైన ముందడగని.. ఏవియేషన్ రంగంలో హైదరాబాద్ భాగస్వామ్యాన్ని పెంచుతోన్న టాటా, బోయింగ్ గ్రూపులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.హైదరాబాద్లో ఉన్న తమ టాటా బోయింగ్ ఎయిరో స్పేస్ లిమిటెడ్ ఫెసిలిటీ ద్వారా మరిన్ని ఉత్పత్తులు తయారీ చేపడతామని బోయింగ్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ ఫెసిలిటీలో బోయింగ్ 737 విమానాల కొరకు రూపొందించే ఎయిర్ ఫిన్ నిర్మాణాలు.. గ్లోబల్ సరఫరా కొరకు ఉద్దేశించినవని ప్రకటించింది.


Next Story