హీరోయిన్ తమన్నా బౌన్సర్ల ఓవరాక్షన్

Tamannaah Bouncers Attacked on Telugu Media Persons at Annapurna Studio. సినీ న‌టి త‌మ‌న్నా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 'బ‌బ్లీ బౌన్స‌ర్' చిత్రం

By -  Medi Samrat
Published on : 17 Sept 2022 8:00 PM IST

హీరోయిన్ తమన్నా బౌన్సర్ల ఓవరాక్షన్

సినీ న‌టి త‌మ‌న్నా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 'బ‌బ్లీ బౌన్స‌ర్' చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన త‌మ‌న్నా న‌గ‌రంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌పై త‌మ‌న్నాకు ర‌క్ష‌ణ‌గా వ‌చ్చిన బౌన్స‌ర్లు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్ద‌రు కెమెరామెన్ల‌కు గాయాల‌య్యాయి. బ‌బ్లీ బౌన్స‌ర్ మీడియా స‌మావేశం ముగిసిన త‌ర్వాత మీడియా ప్ర‌తినిధుల‌తో త‌మ‌న్నా బౌన్స‌ర్లు వాగ్వాదానికి దిగారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు కూడా బౌన్స‌ర్ల‌ను నిల‌దీయ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదంతో పాటు ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది.

హైదారాబాద్‌కు వచ్చిన తమన్నా అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక ఆ ప్రెస్ మీట్ తరువాత గా తమన్నాతో ఇంటర్య్వూ తీసుకునేందుకు రిపోర్టర్లు ముందుకు వచ్చారు. బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే మరికొందరు బౌన్సర్లు రిపోర్టర్లపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో రిపోర్టర్లు.. కెమెరామెన్లు ఏకమై వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో తమన్నా బౌన్సర్ ల దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story