భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ : ట్రాఫిక్, పార్కింగ్‌కు సంబంధించి సూచనలు
T-20 India-Aus match Take note of traffic diversions, parking slots. సెప్టెంబర్ 25న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్
By Medi Samrat Published on 24 Sep 2022 11:40 AM GMTసెప్టెంబర్ 25న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మూడో T-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ (భారత్ vs ఆస్ట్రేలియా)కు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్, పార్కింగ్ కు సంబంధించి పలు సూచనలు చేసింది.
1. తార్నాక వైపు నుండి వచ్చే VIP పాస్ హోల్డర్లు హబ్సిగూడ - NGRI - ఏక్ మినార్ కుడి మలుపు - గేట్ నంబర్ 1 వైపు వెళ్లాలి. వారు స్టేడియంలోకి ప్రవేశించి తమ వాహనాలను A మరియు C పార్కింగ్ (స్టేడియం లోపల) లో పార్క్ చేయాలి.
2. అంబర్‌పేట్ వైపు నుండి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్‌లు దూరదర్శన్ - రామంతపూర్ - స్ట్రీట్ నెం. 8 ఎడమ మలుపు - గేట్ నంబర్ 1 వైపు వెళ్లాలి. స్టేడియంలోకి ప్రవేశించి, తమ వాహనాలను ఎ మరియు సి పార్కింగ్ స్లాట్‌లలో (స్టేడియం లోపల) పార్క్ చేయాలి.
3. నాగోల్ వైపు, వరంగల్ హైవే వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్లు ఉప్పల్ క్రాస్‌రోడ్ - సర్వే ఆఫ్ ఇండియా - ఏక్ మినార్ ఎడమ మలుపు - గేట్ నంబర్ 1 వైపు వెళ్లి స్టేడియంలోకి ప్రవేశించి, తమ వాహనాలను ఎ, సి పార్కింగ్ స్లాట్‌లలో (లోపల) పార్క్ చేయాలి.
4. A, C పార్కింగ్ స్థలాల వాహన పాస్ హోల్డర్లు హబ్సిగూడ - ఉప్పల్ రహదారిని మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.
5. హబ్సిగూడ, ఉప్పల్ రోడ్ వైపు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ఇవ్వనున్నారు. వాహనాలను NGRI గేట్ నంబర్ I నుండి III వరకు స్టేడియం మెట్రో పార్కింగ్ వరకు ఎడమ వైపున పార్క్ చేయాలి.
6. ఉప్పల్-హబ్సిగూడ రహదారి నుండి వచ్చే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు తమ వాహనాలను జెన్‌పాక్ట్ సర్వీస్ రోడ్డులో హిందూ ఆఫీస్ లేన్ వైపుగా పార్క్ చేయాలి. జెన్‌పాక్ట్ నుండి NGRI మెట్రో స్టేషన్ వరకు ఎడమ వైపున పార్క్ చేయాలి.
7. ఉప్పల్-రామంతాపూర్, రామంతపూర్-ఉప్పల్ వైపు నుండి వచ్చే నాలుగు చక్రాల వాహనాలను సినీపోలీస్ సెల్లార్‌లో, మోడ్రన్ బేకరీ లోపల, శక్తి డిటర్జెంట్ ఓపెన్ ప్లేస్, DSL ఓపెన్ ల్యాండ్ (NSL/Arena ఎదురుగా), ఏవ్ మారియా ఇంటర్నేషనల్ స్కూల్ (చర్చ్)లో పార్క్ చేయాలి.
8. ఉప్పల్-రామంతాపూర్, రామంతపూర్-ఉప్పల్ నుండి వచ్చే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను మోడరన్ బేకరీ, అమ్మ భగవాన్ సేవా లేన్, ఈనాడు ఆఫీస్ లేన్, KV స్కూల్ నుండి DSL (ప్రతి వైపు), మరియు LG గోడౌన్ నుండి NSL భవనం వరకు పక్కనే ఉన్న మార్గాలలో పార్క్ చేయవచ్చు.
9. ఉప్పల్ జంక్షన్ నుండి జెన్‌పాక్ట్ వరకు (హబ్సిగూడ రోడ్డు వైపు) ప్రధాన రహదారికి ఇరువైపులా నాలుగు చక్రాల వాహనాలను పార్కింగ్ చేయడం నిషేధించారు.
పరిమితులు
సాయంత్రం 4 గంటల నుంచి 12.30 గంటల మధ్య నాగోలు, చెంగిచెర్ల క్రాస్‌రోడ్, ఎన్‌ఎఫ్‌సీ వంతెన, హబ్సిగూడ, అంబర్‌పేట వైపు నుంచి భారీ వాహనాలకు అనుమతి లేదు. పాదచారులు ఏ రహదారి నుండి అయినా స్టేడియంలోకి ప్రవేశించవచ్చు. ఏక్ మినార్ నుంచి ఎల్‌జీ గోడౌన్‌కు (రామంతపూర్ మార్గం వైపు) వాహనాల పాస్‌లు ఉన్న వాహనాలను మినహాయించి ఇతర వాహనాలను అనుమతించరు. స్ట్రీట్ నంబర్ 8 హబ్సిగూడ నుండి రామాంతపూర్ వరకు వెళ్లవచ్చు. ఆంక్షలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పౌరులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ట్రాఫిక్ మళ్లింపులు, రోడ్ల మూసివేతలను తొలగిస్తారు.