గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. జైలు నుండి బయటకు రావడానికి ముందు, తన నుదిటిపై చిన్న గడ్డ ఉందని.. దాని కారణంగా చాలా నొప్పి వచ్చిందని రాజా సింగ్ పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రిలో చేరి నేను లిపోమా సర్జరీ చేయించుకున్నానని తెలిపారు. సర్జరీ కారణంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని.. నేను అతి త్వరలో నా గోషామహల్ ప్రజల మధ్య ఉంటానని చెప్పుకొచ్చారు రాజాసింగ్.
అంతకు ముందు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పై కూడా స్పందించారు. ప్రజా సంగ్రామ యాత్ర అంటే కేసీఆర్, కేటీఆర్‌కు నిద్ర పట్టట్లేదని ఆరోపించారు. కేసీఆర్ ఎనిమిదో నిజాంలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. నిజాం తరహాలో కేసీఆర్, కుటుంబ వారసత్వంగా అధికారాన్ని తన కుమారుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోన్నారని, దీన్ని బండి సంజయ్ అడ్డుకుంటున్నారని చెప్పారు. బండి సంజయ్ అనుచరుడిగా, ఆయనను అభిమానించే వ్యక్తిగా మాత్రమే మాట్లాడుతున్నానని అన్నారు.