సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవు: రంగనాథ్‌

బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రాకు వర్తించవని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

By అంజి  Published on  18 Sept 2024 7:27 AM IST
Supreme Court, HYDRAA, AV Ranganath, Telangana

సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవు: రంగనాథ్‌

హైదరాబాద్: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రాకు వర్తించవని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రైవేట్‌ కట్టడాలపై అనధికార బుల్డోజర్‌ యాక్షన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్‌ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది.

ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, ఫుట్‌ పాత్‌లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర వాటిపై ఎలాంటి అనధికార నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. "తదుపరి తేదీ వరకు ఈ కోర్టు అనుమతి తీసుకోకుండా కూల్చివేతలు ఉండవు. అయితే, బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలకు ఈ ఉత్తర్వు వర్తించదు" అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.ఎన్నికల కమిషన్‌కు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని పేర్కొంది.

Next Story