జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని సునీత పిటిషన్

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 30 Dec 2025 11:22 AM IST

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని సునీత పిటిషన్

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ ఎన్నిక చెల్లదంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నవీన్‌ యాదవ్‌ ఎన్నిక చెల్లదని భావిస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు ఎన్నిక రద్దు చేయాలని కోర్టును కోరారు.. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసులను నవీన్ యాదవ్ వెల్లడించలేదని పేర్కొన్నాది. ప్రచారంలోనూ నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రి పరిశీలనలో ఉంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్.. 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్)కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ (మాగంటి సునీత) 74,259 ఓట్లు, బీజేపీ (దీపక్ రెడ్డి)కు 17,061 ఓట్లు వచ్చాయి.

Next Story