హైదరాబాద్ వాసులకు అలర్ట్.. సన్‌డే ఫన్‌డే.. ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
Sunday Funday events at Tank Bund today.గత కొంతకాలంగా ట్యాంక్ బండ్‌పై నిలిచిపోయిన సన్‌డే ఫన్‌డే కార్యక్రమాన్ని
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2023 3:10 AM GMTగత కొంతకాలంగా ట్యాంక్ బండ్‌పై నిలిచిపోయిన సన్‌డే ఫన్‌డే కార్యక్రమాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్(హెచ్ఎండీఏ) అధికారులు తిరిగి ప్రారంభిస్తున్నారు. నేటి నుంచి ప్రతి ఆదివారం నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సారి నీటిలో కొత్తగా మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ప్రతి గంటకు 15 నిమిషాల పాటు 5-6 మ్యూజిక్ ట్యూన్‌లతో మ్యూజికల్ ఫౌంటెయిన్‌లు అలరించనున్నాయి.
సన్‌డే ఫన్ కార్యక్రమం నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
* లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి వాహనాలను అనుమతించరు.
* అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.
* తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఈ రూట్‌లో వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు.
* కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ ఆలయం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలను ఓల్డ్ సచివాలయం వద్ద తెలుగుతల్లి ఫై ఓవర్ పైకి మళ్లిస్తారు.
పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు..
సన్ డే ఫన్ డే కార్యక్రమానికి హాజరు అయ్యే వారు తమ వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి.
- అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆదర్శ్ నగర్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు.
- కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్ట్రన్స్ పార్క్ వరకు, బుద్ద భవన్ వెనుక నుంచి నెక్లెస్ రోడ్డు వరకు, ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు.