హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. దంచికొట్టిన వర్షం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది.

By Medi Samrat
Published on : 10 April 2025 6:00 PM IST

హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. దంచికొట్టిన వర్షం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. మియాపూర్, మ‌దీనాగూడ‌, చందాన‌గ‌ర్‌, లింగంప‌ల్లి, కొండాపూర్, గ‌చ్చిబౌలి, మాదాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, మేడ్చ‌ల్, దుండిగ‌ల్, గండిమైస‌మ్మ‌, బ‌హ‌దూర్‌ప‌ల్లి, గ‌గిల్లాపూర్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో గురువారం మ‌ధ్యాహ్నం వాన పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహ‌న‌దారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్ లో దట్టంగా క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయనున్నాయి.

Next Story