వ‌న‌స్థ‌లిపురంలో కలకలం.. కుక్క నోట్లో బాలుడి తల

Stray dog carries boy head in Vanasthalipuram.వ‌న‌స్థ‌లిపురం ప‌రిధిలోని స‌హార‌లో గుర్తు తెలియ‌ని ఓ బాలుడి త‌ల క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 5:59 PM IST
వ‌న‌స్థ‌లిపురంలో కలకలం.. కుక్క నోట్లో బాలుడి తల

వ‌న‌స్థ‌లిపురం ప‌రిధిలోని స‌హార‌లో గుర్తు తెలియ‌ని ఓ బాలుడి త‌ల క‌ల‌క‌లం రేపింది. ఓ శిశువు త‌ల‌ను కుక్క నోట్లో ప‌ట్టుకుని వెలుతుండ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే తేరుకుని కుక్క‌ను త‌ర‌మ‌డంతో అది ఆ బాలుడి త‌ల‌ను అక్క‌డే వ‌దిలివెళ్లిపోయింది. స‌హారా గేట్ 1 సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల బూత్ య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. కుక్క శిశువు తలను.. ఎక్కడి నుంచి తీసుకువచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. బాలుడి త‌ల‌ను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎవరైనా చంపి తలను మొండాన్ని వేరు చేశారా? లేకపోతే నరబలి ఇచ్చారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story