గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన శ్రీ సత్య
Sri Satya joins Green India Challenge in Hyderabad. బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, శ్రీ సత్య ఆదివారం నాడు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన
By Medi Samrat Published on
22 Jan 2023 11:43 AM GMT

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, శ్రీ సత్య ఆదివారం నాడు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. శ్రీ సత్య జూబ్లీహిల్స్‌లోని ప్రశాషన్ నగర్‌లో మొక్కలు నాటింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం పట్ల శ్రీ సత్య సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతోపాటు పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు తమవంతు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో ముందుకు వచ్చినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు శ్రీ సత్య కృతజ్ఞతలు తెలిపింది. మొక్కలు నాటడం ద్వారా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీ సత్య బిగ్‌బాస్ కంటెస్టెంట్లు.. గీత, ఫైమా, ఆదిరెడ్డిలను నామినేట్ చేసింది.
Next Story