తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - తిరుపతి - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ, వినాయక చతుర్థి పండుగల దృష్ట్యా ఈ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ప్రత్యేక రైలు (నెం. 07120) ఆగస్టు 31వ తేదీ (బుధవారం) సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.45 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక రైలు (నం. 07121) సెప్టెంబర్ 1వ తేదీ (గురువారం) రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, జనరల్ కోచ్‌ల సదుపాయం ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, వికారాబాద్, తాండూరు, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.