Sonu sood Surprise Visit to Fast Food Center In Hyderabad. సినిమాల్లో విలన్ వేషాలు వేసినప్పటికి రియల్‌లైప్‌లో హీరోగా
By Medi Samrat Published on 26 Dec 2020 7:54 AM GMT
సినిమాల్లో విలన్ వేషాలు వేసినప్పటికి రియల్‌లైప్‌లో హీరోగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ఎంతో మంది వలస కూలీలకు తమ వంతు సాయం అందించి ప్ర్యతేక వాహానాలను ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించి అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.
శుక్రవారం సాయంత్రం.. తన అభిమానికి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు సోనూసూద్. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన అనిల్‌కుమార్.. ప్రకాశ్‌నగర్‌లో కొంతకాలంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో తన చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తొలగించి.. సోనుసూద్ స్ఫూర్తితో ఇటీవల తన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పేరును 'లక్ష్మీ సోనుసూద్'గా మార్చి పూర్తిగా హైదరాబాదీ స్టైల్‌లో ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నాడు. సోనూసూద్ ఫొటోను పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చిన పలువురు కస్టమర్లు సోనూసూద్ ఫోటోతో సెల్పీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విషయం సోనూ దాకా వెళ్లింది. శుక్రవారం సాయంత్రం సోనూసూద్ ఆ ఫుడ్ కోర్టును సందర్శించేందుకు రాగా అనిల్ ఘనస్వాగతం పలికాడు. ఈ సందర్భంగా సోనూ తానే స్వయంగా ఎగ్ ఫ్రైడ్‌రైస్‌ను తయారు చేసుకుని ఆరగించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.