కుమారి ఆంటీని కలిసిన సోనూ సూద్

నటుడు సోనూ సూద్ కుమారి ఆంటీని కలిశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలోని కుమారీ ఆంటీ రోడ్‌సైడ్ ఫుడ్ స్టాల్‌లో సోనూ సూద్ సందడి చేసారు.

By Medi Samrat  Published on  5 July 2024 6:08 PM IST
కుమారి ఆంటీని కలిసిన సోనూ సూద్

నటుడు సోనూ సూద్ కుమారి ఆంటీని కలిశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలోని కుమారీ ఆంటీ రోడ్‌సైడ్ ఫుడ్ స్టాల్‌లో సోనూ సూద్ సందడి చేసారు. కుమారి ఆంటీ అన్నం, చికెన్, మటన్ కర్రీ వంటి వివిధ రకాల మాంసాహార వంటకాలను అందించే ఫుడ్ స్టాల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఆమెను పలువురు ప్రముఖులు కలుస్తూ ఉంటారు.

సోను సూద్ తాజాగా సోషల్ మీడియాలో ఆమెను కలిసిన ఒక వీడియోను పంచుకున్నారు. మీ ద‌గ్గర ఎలాంటి వంట‌కాలు దొరుకుతాయ‌ని ఆమెను సోనూసూద్ అడిగారు. త‌న వ‌ద్ద అన్ని ర‌కాల వెజ్‌, నాన్‌వెజ్ ఫుడ్ దొరుకుంద‌ని కుమారి ఆంటీ చెప్పారు. అలాగే వెజ్ వెల రూ. 80 అని, నాన్‌వెజ్ రూ. 120 అని ఆమె తెలిపారు. దీనికి సోనూసూద్ తాను మాత్రం వెజ్ తింటాన‌ని సోనూ చెప్పారు. ప్రతి ఒక్కరూ కుటుంబాల కోసం ఎలా కష్టపడాలి అనే దాని గురించి మాట్లాడుతాము.. అలాంటి విషయాలకు సంబంధించి కుమారి ఆంటీ ఉత్తమ ఉదాహరణ అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆమెకు హామీ ఇచ్చారు.

Next Story