డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ మందు బాబు చెప్పిన సమాధానం నవ్వు తెప్పించింది. మేడ్చల్ జిల్లాలలోని కండ్లకోయ వద్ద సైబరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కరుణాకర్ అనే ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు కరుణాకర్ ను బ్రీత్ అనలైజ్ చేయడంతో 94 వచ్చింది. ఏం తాగావని పోలీసులు కరుణాకర్‌ను అడిగారు. తాను పాలు తాగానని చెప్పాడు. దీంతో అక్కడున్న పోలీసులు, మిగతా వాహనదారులు పకపక నవ్వారు. ఫ్రెండ్ ఇంటిలో పాలు తాగి ఇంటికి వెళ్తున్నానని కరుణాకర్ పోలీసులకు సమాధానం ఇచ్చాడు. తర్వాత కరుణాకర్ ను పోలీసులు అడగగా తాను మద్యం సేవించినట్లుగా ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.