కోతిని కొట్టబోయి ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి!

Software Employee Died. సాధారణంగా కోతులు అంటేనే అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. కానీ కోతిని కొట్టబోయి ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

By Medi Samrat  Published on  1 Jan 2021 7:34 AM GMT
Software Employee Died

సాధారణంగా కోతులు అంటేనే అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు కోతి చేష్టలు చూడటానికి ఎంతో సరదాగా అనిపించిన, మరికొన్ని సార్లు కోతుల వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడతాయి. అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కోతుల కారణం వల్ల ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన లోకేశ్‌ అనే వ్యక్తి గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.కూకట్‌పల్లిలోని జయనగర్‌ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోం కావడం వల్ల ఇంటి నుంచి విధులను నిర్వహిస్తున్నాడు.అయితే లోకేష్ నివసిస్తున్న కాలనీలో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటి ఆగడాలు రోజురోజుకీ శృతి మించి పోతున్నాయి. ఈ కోతుల బెడద నుంచి విముక్తి పొందేందుకు మంగళవారం లోకేష్ తన ఇంటి తలుపులు మూసి వేసుకుని తన విధులను నిర్వహిస్తున్నారు.

తలుపులు మూసిన ఇంట్లోకి గాలి రావడం కోసం తెరిచి ఉన్న రంధ్రం ద్వారా కోతులు లోపలికి వచ్చాయి. అయితే వాటిని తరిమే నేపథ్యంలో లోకేష్ డోర్ కర్టెన్ కు ఉన్న రాడ్ తో వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కోతిని కొట్టబోతుండగా అతని చేతిలో ఉన్న ఇనుపరాడ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. ఒక్కసారిగా విద్యుత్ తీగలకు రాడ్ తగలడంతో లోకేష్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన స్థానికులు లోకేష్ ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లోకేష్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసే లోకేష్ కు ఒక ఏడాది కుమారుడు, భార్య ఉన్నారు.


Next Story