హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ గర్ల్స్ హాస్టల్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్‌లోని సిటిజన్ కాలనీలో ఉన్న నైన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన హాస్టల్‌లోని నాలుగో ఫ్లోర్‌లో ఏసీలు బ్లాస్ట్ అయ్యి భారీగా మంటలు చెలరేగాయి.
దీంతో ఆ మంటలతో పాటు పొగ ఐదో ఫ్లోర్‌కు చేరడంతో ఆ రూమ్‌లో ఉన్న దాదాపు 20 మంది విద్యార్థినులలో ఆరుగురు విద్యార్థినులు ఊపిరాడక అదే గదిలో స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం ఆ విద్యార్థినులకు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు చికిత్స అందించారు.