Hyderabad: డ్రగ్స్‌ కేసులో ఎస్సై అరెస్ట్‌

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో ఎస్సై రాజేందర్‌ను నగరంలోని రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు

By అంజి  Published on  27 Aug 2023 9:52 AM IST
SI Rajender, arrest, drug case, Hyderabad

Hyderabad: డ్రగ్స్‌ కేసులో ఎస్సై అరెస్ట్‌

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో ఎస్సై రాజేందర్‌ను నగరంలోని రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలో ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ టీమ్‌లో పని చేస్తున్న రాజేందర్‌.. సీజ్‌ చేసిన డ్రగ్స్‌ను ఇంట్లో పెట్టుకున్నారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్‌ చేసిన డ్రగ్స్‌ ఇంట్లో పెట్టుకుని అమ్ముకోవాలని రాజేందర్‌ ప్లాన్‌ చేసుకున్నట్టు సమాచారం. కోర్టులో డిపాజిట్‌ చేసే సమయంలో ఈ వ్యవహారం బయటపడింది.

డ్రగ్స్‌ తక్కువగా కనిపించడంతో రాజేందర్‌ని పోలీసులు విచారించారు. డ్రగ్స్ నిందితులను పట్టుకునేందుకు మహారాష్ట్రకు వెళ్లిన బృందంలో సైబర్ క్రైం ఎస్సై రాజేందర్ కూడా ఉన్నాడు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో.. కొంత డ్రగ్స్‌ని ఎస్సై మాయం చేశాడు. విచారణలో డ్రగ్స్ ను తన ఇంటి లాకర్‌లో దాచిపెట్టినట్టు వెల్లడించాడు. కొద్దిరోజుల తరువాత డ్రగ్స్ అమ్మాలని చూశాడు. ఉన్నతాధికారుల విచారణలో నిజాలు తేలడంతో ఎస్సై రాజేందర్‌ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఇంట్లో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.

Next Story