న్యూస్ మీటర్ తెలుగుకు షేర్‌చాట్ ట్రోఫీ

ShareChat Trophy for News Meter Telugu. 15 భారతీయ భాషల్లో 180 మిలియన్లకు పైగా క్రీయాశీల‌ వినియోగాదారుల‌ను కలిగి ఉన్

By Medi Samrat  Published on  23 Sept 2022 5:18 PM IST
న్యూస్ మీటర్ తెలుగుకు షేర్‌చాట్ ట్రోఫీ

15 భారతీయ భాషల్లో 180 మిలియన్లకు పైగా క్రీయాశీల‌ వినియోగాదారుల‌ను కలిగి ఉన్న భారతీయ నెంబ‌ర్ వ‌న్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్‌చాట్‌. న్యూస్ మీటర్ తెలుగు.. టాప్ తెలుగు న్యూస్ పోర్టల్‌లలో ఒకటి. న్యూస్‌మీట‌ర్ తెలుగుకు షేర్‌చాట్ ప్ర‌ధాన ఆగ్రిగేట‌ర్‌. షేర్‌చాట్ బాగ‌స్వామ్యంతో న్యూస్‌మీట‌ర్ తెలుగు అప్ర‌తిహ‌తంగా ముందుకు దూసుకెళ్తుంది. న్యూస్ మీటర్ తెలుగు షేర్‌చాట్‌లో 2.43 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో టాప్ కంటెంట్ క్రియేటింగ్ న్యూస్ పోర్ట‌ల్‌గా ఉంది.

మంచి సబ్‌స్క్రైబర్‌లు, వీక్షకుల సంఖ్య న్యూస్ మీటర్ తెలుగుకు ఉన్నందున షేర్‌చాట్ ప్ర‌శంసాపూర్వ‌కంగా ట్రోఫీని అందించాలని నిర్ణయించుకుంది. ఈ నేప‌థ్యంలోనే షేర్‌చాట్ కీ అలయన్స్ మేనేజర్ ఎన్ వి జగదీష్ కుమార్ బెంగుళూరు నుంచి న్యూస్ మీట‌ర్ తెలుగు టీమ్‌ను అభినందించి, ట్రోఫిని బ‌హుక‌రించేందుకు హైద్రాబాద్ కు వ‌చ్చారు. ఓ హోట‌ల్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక‌ కార్యక్ర‌మంలో ట్రోపి బ‌హుక‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో న్యూస్‌మీట‌ర్ ఎడిట‌ర్ కొరీనా సొరెస్‌, ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ క‌నీజా, తెలుగు ఎడిట‌ర్ కవిత నెల్లుట్ల ఇత‌ర‌ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story