తీవ్ర హృద్రోగంతో బాధపడుతున్న యువ‌కునికి కృత్రిమ గుండె సహాయంతో విజయవంతమైన చికిత్స

Serious Heart Disorder Treatment. హృదయస్పందన క్రమపద్ధతిలో లేక తివ్ర హృద్రోగంతో బాధపడుతుండడం వల్ల లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైస్ ద్వారా

By Medi Samrat  Published on  6 April 2022 8:59 PM IST
తీవ్ర హృద్రోగంతో బాధపడుతున్న యువ‌కునికి కృత్రిమ గుండె సహాయంతో విజయవంతమైన చికిత్స

హృదయస్పందన క్రమపద్ధతిలో లేక తివ్ర హృద్రోగంతో బాధపడుతుండడం వల్ల లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైస్ ద్వారా కృత్రిమ హృదయస్పందనతో చికిత్స పొందుతున్న 34 సంవత్సరాల వయస్సుగల ఒక కంప్యూటర్‌ ఇంజనీర్‌ ఏ.ఐ.జి హాస్సిటల్స్‌లో చేరడం జరిగింది. ఈ వ్యాధిగ్రస్తునికి వెంట్రిక్యులర్‌ ట్యాక్‌కార్షియా - గుండె క్రింది గదుల నుండి ఉద్భవించి అత్యంత పెగవంతమైన హృదయస్పందన రేటు ఉన్నటువంటి ప్రాణాంతకమైన ఎరిథ్మియాగా రోగ నిర్ధారణ చేయబడింది. తక్కువ ప్రభావం గల అనేక మందులు ఉపయోగించడం వల్ల విద్యుత్‌ షాక్‌లు ఇచ్చి చికిత్సచేయడం జరిగింది. దీనివల్ల కూడా ప్రయోజనం కనబడలేదు. గుండెలోని ఎడమవైపు గదులకు సరైన చికిత్స అందించకపోవడం వల్ల గుండెలోని కుడివైపు గదులు క్షీణించి రోగికి ప్రాణాంతకర పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితులలో డా. నరసింహన్‌ నేతృత్వంలో ఏ.ఐ.జి హాస్పిటల్స్‌లోని ఎలెక్టోఫిజియాలజిస్ట్‌ నిపుణల బృందం పలురకాల కాథెటర్‌లను వివిధ రక్తనాళాల ద్వారా గుండెలోకి పంపించే సంక్లిష్ట పద్ధతిని చేపట్టారు. ఆపై అధునాతన పరికరాలను ఉపయోగించి ఎలెక్టికల్ సిగ్నల్స్‌ని విశ్లేషించడం ద్వారా క్రమపద్ధతిలేని హృదయస్పందనకు కారణం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడం జరిగింది. ౩డి మ్యాపింగ్ వ్యవస్థ (ఎన్‌సైట్‌న్యావెక్స్‌)ను ఉపయోగించి లక్ష్యాన్ని కనుగొనడం జరిగింది. చివరిగా, వి.టీ ఎబ్లేషన్‌ అని పిలవబడే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఉపయోగించి ఎరిథ్మియాని అరికట్టడం జరిగింది. అబ్లేషన్‌ సైట్ సమీపంలో కృత్రిమ పంపు యొక్క రోటర్లు ఉండటం ద్వారా ఇప్పటికే సంక్లిష్టమైన ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది.

హృదయస్పందన సమస్యకు పూర్తి పరిష్కారం, రక్తపోటులో వేగవంతమైన క్లినికల్‌ మెరుగుదలతో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైస్‌ సహాయంతో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తునికి ఇది మొదటి విజయవంతమైన వెంట్రిక్యులర్‌ ట్యాకికార్డియా ఎబ్లేషన్‌గా దీనిని గుర్తించవచ్చు. గుండె వైఫల్య నిపుణులు, అనస్థీషియాలజిస్టులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బంది ప్రత్యేక బృందం మద్దతుతో, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైద్యుల బృందం మధ్య ఖచ్చితమైన సమన్వయంతో ఇది సాధ్యమైంది.













Next Story