GHMC, HMDA అధికారులపై కేసులు

చెరువుల బఫర్‌ జోన్లలో అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 31 Aug 2024 3:30 PM IST

GHMC, HMDA అధికారులపై కేసులు

చెరువుల బఫర్‌ జోన్లలో అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ క్ర‌మంలోనే చందానగర్‌, ప్రగతినగర్‌లోని ఎర్రకుంట చుట్టూ అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి చెందిన ఆరుగురు ఉన్నతాధికారులపై సైబరాబాద్‌ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈవోడబ్ల్యూ) ఈ కేసులను నమోదు చేసింది.

ఇందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదాంష్, బాచుపల్లి తహశీల్దార్ పుల్ సింగ్, మేడ్చల్-మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ శ్రీనివాసులు, హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుధీర్ కుమార్, హెచ్‌ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ ఉన్నారు. సరస్సుల ఆక్రమణకు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతికి లేఖ రాశారు. ఈ క్ర‌మంలోనే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Next Story