వీర్యం నిల్వ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు

వీర్యం నిల్వ చేసినందుకు ఓ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

By Medi Samrat
Published on : 26 July 2025 7:37 PM IST

వీర్యం నిల్వ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు

వీర్యం నిల్వ చేసినందుకు ఓ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒక మహిళ తన భర్త వీర్య కణాల ద్వారా సంతానం పొందాలనే ఆశతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించింది. అయితే, వైద్యులు వేరే వ్యక్తి వీర్యకణాలతో ఆమెకు గర్భం కలిగించారు. అనుమానం వచ్చిన దంపతులు డీఎన్ఏ పరీక్ష చేయుంచగా, అది వేరే వ్యక్తి డీఎన్ఏగా తేలింది.

ఆ జంట పోలీసులను ఆశ్రయించగా ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యాన్ని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వీర్య సేకరణలో అక్రమ పద్ధతులు అవలంబిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Next Story