సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు జాతీయ టూరిజం అవార్డు

Secunderabad Railway Station receives National Tourism Award. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2018-19 సంవత్సరానికి గాను భారతీయ రైల్వే ఉత్తమ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా

By Medi Samrat  Published on  27 Sep 2022 3:14 PM GMT
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు జాతీయ టూరిజం అవార్డు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2018-19 సంవత్సరానికి గాను భారతీయ రైల్వే ఉత్తమ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా జాతీయ టూరిజం అవార్డును పొందింది. ఈ అవార్డును సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా, న్యూఢిల్లీలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టేషన్ డైరెక్టర్ జోగేష్ కుమార్‌లకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అందజేశారు. జాతీయ పర్యాటక అవార్డులను పర్యాటక మంత్రిత్వ శాఖ వారి అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా వివిధ ప్రయాణ, పర్యాటక సంస్థ‌లకు అందజేస్తుంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1874లో హైదరాబాద్ స్టేట్ నిజాంచే నిర్మించబడింది. ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ఎఫ్‌ఓబిలు, పర్యాటక సమాచార కేంద్రం, హెల్ప్‌డెస్క్, ఛార్జింగ్ పాయింట్‌లు, ట్యాప్‌లు, కూలర్లు, వెయిటింగ్ హాళ్లు, బ్యాటరీతో నడిచే కార్లు వంటి పర్యాటకుల ప్రయోజనాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అందించిన ప్రయాణీకులకు అనుకూలమైన సౌకర్యాలతో పాటు.. ఆటో స్టాండ్, రిటైరింగ్ రూమ్‌లు, AC వెయిటింగ్ హాల్స్, సాధారణ వెయిటింగ్ హాల్స్ మొదలైనవి సౌక‌ర్యాలు ఈ అవార్డు కోసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనరల్ మేనేజర్ (ఇన్‌ఛార్జ్) అరుణ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బంది బృందం కృషిని అభినందించారు.
Next Story