ఆ రూట్‌లో మూడు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌ప‌నున్న‌ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

SCR to operate special trains between Narasapur and Secunderabad. అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నరసాపూర్-సికింద్రాబాద్ -నర్సాపూర్

By Medi Samrat  Published on  12 Aug 2022 7:41 PM IST
ఆ రూట్‌లో మూడు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌ప‌నున్న‌ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నరసాపూర్-సికింద్రాబాద్ -నర్సాపూర్, నర్సాపూర్ - సికింద్రాబాద్ వన్ వే రూట్‌లో మూడు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. రైలు నంబర్ 07466 నరసాపూర్-సికింద్రాబాద్ ఆగస్టు 13, 15 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు గ‌మ్యానికి చేరుకుంటుంది.

రైలు నంబర్ 07467 సికింద్రాబాద్-నరసాపూర్ ఆగస్టు 14న రాత్రి 9.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు గ‌మ్యానికి చేరుకుంటుంది. నరసాపురం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో రెండు రూట్ల‌లో ఆగుతుందని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది.


Next Story